పిల్లల్లో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి మరియు దానిని అదుపుచేయుట పిల్లల్లో మూత్రపిండాల మార్పిడి... ఆశా కిరణం.... మూత్రం ఉత్పత్తి చేయడం ద్వారా రక్తం నుంచి వ్యర్థాలను, మినరల్స్ని మరియు ఫ్లూయిడ్‌ని వడపోసేందుకు మరియు తొలగించేందుకు మూత్రపిండాలు సహాయపడతాయి. మూత్రపిండాలు వాటి పనితనం కోల్పోయినప్పుడు, శరీరంలో హానికారక స్థాయిల్లో ఫ్లూయిడ్ మరియు వ్యర్థాలు పేరుకుంటాయి. మూత్రపిండాలు వాటి మామూలు పనితనంలో 90% కోల్పోయినప్పుడు అంత్య-దశ మూత్రపిండాల వ్యాధి కలుగుతుంది. సిస్టిక్ డైస్‌ప్లాస్టిక్ మూత్రపిండాలు, పాలిసిస్టిక్ మూత్రపిండాలు, వారసత్వ మూత్రపిండాల వ్యాధులు మరియు దీర్ఘకాలిక గ్లొమెరులర్, ట్యూబులర్ వ్యాధులు గల పిల్లల్లో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సికెడి) కలుగుతుంది. ఇది పూర్వ స్థితికి తీసుకురాలేనిది. జీవించివుండటానికి వాటికి డయాలిసిస్ సపోర్టు లేదా మూత్రపిండాల ట్రాన్స్‌ప్లాంటేషన్ కావాలి. సికెడి ప్రభావాలు: • రక్తహీనత • ఆకలి లేకపోవడం, వికారం మరియు వాంతులు • ఎముకల బలహీనత • గుండె జబ్బు • అధిక రక్త పోటు • వాల్యూమ్ ఓవర్లోడ్ సికెడిని అదుపుచేయుట: పరిమితంగా మాంసాహారంతో, ఉప్పు తక్కువ, న్యూనె తక్కువ ఆహారం సిఫారసు చేయబడుతోంది. రక్త పోటును నియంత్రించేందుకు మందులు ప్రిస్క్రయిబ్ చేయబడతాయి. రక్తహీనత మరియు ఎదుగుదల సమస్యను పరిష్కరించేందుకు ఎరిథ్రోపొయిటిన్ మరియు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్‌లకు అదనంగా క్యాల్షియం మరియు బైకార్బొనేట్ అనుబంధాలు సిఫారసు చేయబడుతున్నాయి. సికెడి ఉన్న పిల్లలు జీవించడానికి డయాలిసిస్ సపోర్టు లేదా మూత్రపిండాల ట్రాన్స్‌ప్లాంటేషన్ కావాలి. డయాలిసిస్ డయాలిసిస్ రెండు రూపాల్లో ఉంటుంది: హెమోడయాలిసిస్ మరియు పెరిటోనియల్ డయాలిసిస్. హెమోడయాలిసిస్‌లో, శరీరం బయట హెమోడయాలిసిస్ మెషీన్ ద్వారా రక్తం శుద్ధిచేయబడుతుంది. వారానికి 2-3 సార్లు 2-4 గంటల డయాలిసిస్ సెషన్‌లు కావాలి. రక్తాన్ని వడపోసేందుకు పెరిటోనియల్ డయాలిసిస్ శరీరం యొక్క సొంత పెరిటోనియల్ మెంబ్రేన్‌ని ఉపయోగిస్తుంది. అంత్య-దశ మూత్రపిండాల వ్యాధి ఉన్న దాదాపుగా పిల్లలందరికీ అంతిమంగా మూత్రపిండాల ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. మూత్రపిండాల ట్రాన్స్ప్లాంటేషన్: ఆశా కిరణం మూత్రపిండాల ట్రాన్స్‌ప్లాంట్ అనేది జీవించివున్న లేదా చనిపోయిన దాత నుంచి సేకరించి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయని వ్యక్తిలో ఆరోగ్యకరమైన మూత్రపిండాన్ని పెట్టే సర్జికల్ ప్రక్రియ. డయాలిసిస్‌తో పోల్చుకుంటే, మూత్రపిండాల ట్రాన్స్‌ప్లాంట్ వల్ల ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి: • మెరుగైన జీవన నాణ్యత • మరణించే ప్రమాదం తక్కువ • కొద్ది ఆహార ఆంక్షలు • తక్కువ చికిత్స ఖర్చు ట్రాన్స్‌ప్లాంటేషన్ రకం • లైవ్ రిలేటెడ్ దాత మూత్రపిండాల ట్రాన్స్‌ప్లాంటేషన్ • హృద్రోగ దాత మూత్రపిండాల ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎవరు మూత్రపిండాల ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవచ్చు? • అంత్య దశ మూత్రపిండాల వ్యాధి ఉన్న బిడ్డ ఎవరైనా డయాలిసిస్ సపోర్టుతో లేదా లేకుండా మూత్రపిండాల ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. అనుకూలమైన ట్రాన్స్‌ప్లాంటేషన్ అందుకున్న రక్తం గ్రూప్ అనుకూలమైన దాత రక్తం గ్రూప్ ఒ ఒ ఎ ఒ, ఎ బి ఒ, బి ఎబి ఒ, ఎ, బి, ఎబి జీవించివున్న- దాత అవయవ దానం సాధారణంగా, కుటుంబ సభ్యులు జీవించివున్న మూత్రపిండ దాతలుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అనుకూలమైన, జీవించివున్న దాత లభించకపోతే, చనిపోయిన- దాత యొక్క మూత్రపిండం కొరకు బిడ్డ పేరు వెయిటింగ్ లిస్టులో పెట్టబడుతుంది. చనిపోయిన-దాత మూత్రపిండం కొరకు నిరీక్షణ సమయం సాధారణంగా కొద్ది సంవత్సరాలు ఉంటుంది. కాడవెరిక్ దాత అవయవ దానం (చనిపోయిన దాత అవయవ దానం) కాడవెరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే చనిపోయిన తరువాత వ్యక్తి నుంచి మూత్రపిండం తొలగించబడుతుందని అర్థం. దాత బ్రెయిన్ డెడ్ అని అనేక పరీక్షలు రుజువు చేసిన తరువాత మాత్రమే కాడవెరిక్ మూత్రపిండాలు తొలగించబడతాయి. అందుబాటులో ఉన్న మూత్రపిండం దానిని పొందడానికి అత్యుత్తమంగా అనుకూలంగా ఉన్న వ్యక్తికి ఇవ్వబడుతుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ముందు అందుకునే వ్యక్తికి (ట్రాన్స్‌ప్లాంట్ అవసరమైన వ్యక్తి) ట్రాన్స్‌ప్లాంట్‌కి ముందు అనేక రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు అవసరమవుతాయి. బిడ్డ యొక్క రక్షణ వ్యవస్థ కొత్త మూత్రపిండాన్ని స్వీకరిస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు యాంటీబాడీ క్రాస్- మ్యాచ్ పరీక్ష చేయబడుతుంది. పరీక్ష తిరిగి నెగెటివ్‌గా వస్తే, మూత్రపిండం స్వీకరించబడుతుందని అర్థం. తిరస్కరించబడటాన్ని నిరోధించేందుకు ట్రాన్స్‌ప్లాంట్‌కి ముందు మరియు తరువాత బిడ్డకు మందులు అవసరమవుతాయి (ఇమ్యునోసప్రెసివ్స్ మరియు ఇమ్యునోమాడ్యులేటర్‌లు). ఇన్ఫెక్షన్‌లను నిరోధించేందుకు వీలుగా, బిడ్డను జబ్బుచేసిన వారి నుంచి దూరంగా ఉంచాలి మరియు ఇంట్లోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గత కొన్నేళ్ళలో, అధునాతన వైద్యం లభిస్తుండటంతో ఎబిఒ అననుకూల మూత్రపిండం ట్రాన్స్‌ప్లాంట్‌ని సుసాధ్యం చేసింది. భిన్న రక్త గ్రూప్ గల జీవించివున్న దాత ఆప్షన్ వెయిటింగ్ లిస్టు సమయాన్ని తగ్గించింది. తిరస్కరించబడటాన్ని నిరోధించేందుకు ఎబిఒ అననుకూల (భిన్న రక్త గ్రూప్‌తో) రెసిపియంట్స్కి ప్లాస్మాఫెరెసిస్ (యాంటీబాడీలను తొలగించే ప్రక్రియ) మరియు మందులు కావాలి (ఇమ్యునోసప్రెసివ్స్ మరియు ఇమ్యునోమాడ్యులేటర్‌లు). ట్రాన్స్‌ప్లాంట్ చేయబడిన మూత్రపిండం తగిన మందులు మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో సుదీర్ఘ కాలం బాగా పనిచేస్తుంది. ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న పిల్లలు స్కూలుకు వెళ్ళవచ్చు మరియు ఆటలు మరియు క్రీడల్లో కూడా పాల్గొనవచ్చు. డా. వి వి ఆర్ సత్య ప్రసాద్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ నెఫ్రాలిజిస్ట్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారా హిల్స్ హైదరాబాద్
Most days, your child’s kidneys work so quietly you never think about them. There’s no noise, no “kidney alert”, just bathroom trips and life as usual.
But behind the scenes, those two small organs are busy. They’re filtering the blood, balancing water
Most parents think about food in terms of “enough” – enough dal, enough roti, enough fruit, enough milk. Calories, protein, carbs, fats. But under the surface, your child’s body is running a far more detailed operation.
Every minute, their cells are t
You’ve probably heard people say, “Kids have such fast metabolism. They burn everything they eat.”
You see it too. They seem to be hungry again not long after a full meal. They grow out of clothes faster than you can buy them. They run, jump, crash,
Almost everyone has known someone who is, or was, on dialysis. Maybe it’s a relative who spends long hours in a hospital chair, or a neighbour who suddenly became “a kidney patient”. When that happens, you see it up close: kidney health